పాలకుర్తిలో మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి..

160
errabelli
- Advertisement -

సిఎం కేసిఆర్ జన్మదినం సందర్భంగా, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ లో చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా తాను పల్లె నిద్ర చేసిన హనుమాన్ తండాలో ప్రజలందరి తో కలిసి వందలాది మొక్కలు నాటారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… కేసీఅర్ బర్త్ డే బహుమతి గా మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున పెట్టటం జరిగిందన్నారు. ఇందులో జిల్లా లోనే కాదు రాష్ట్రం లో కూడా మొదటి స్థానం లో నిలిచిందన్నారు. ఎంపీ సంతోష్ పిలుపు మేరకు కోటి మొక్కలు కాదు రెండు కోట్ల మొక్కలు నాటామని, ముఖ్యమంత్రి గారి 6 సంవత్సారాల పరి పాలన కాలం లో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేశారని తెలిపారు.

వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భీమా, పేదలకు కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్, పేరున లక్ష రూపాయల చెక్కులు, కేసీఅర్ కిట్ లు , మిషన్ భగీరథ వంటి పథకాలు చేపట్టామన్నారు. తండాల లో కూడా తాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రపంచ, దేశ, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఅర్ గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటూ, ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎంపి పసునూరి దయాకర్, వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, కార్పొరేటర్ చింతల యాదగిరి, లలిత యాదవ్, పోలీస్ బెటాలియన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 6వేల మొక్కలను శిక్షణలో ఉన్న పోలీస్ లు నాటారు.

- Advertisement -