అసెంబ్లీ ప్రాంగణంలో కోటి వృక్షార్చన…

283
pocharam
- Advertisement -

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతమైంది. అసెంబ్లీ ఆవరణలో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి క‌లిసి మొక్క‌లు నాటారు. ఈసందర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు స్పీకర్ పోచారం. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో జీవించి రాష్ర్టానికి, ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించాల‌ని ఆ దేవున్ని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. భ‌విష్య‌త్ త‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం చేప‌ట్టారు అని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మండలి విప్ కుచికుళ్ళ దామోదర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు పాల్గొన్నారు.

- Advertisement -