- Advertisement -
టీఆర్ఎస్ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. చెన్నమనేని తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించగా కాంగ్రెస్ నేత శ్రీనివాస్ తరపున రవి కిరణ్ తన వాదనలు వినిపించారు.
చెన్నమనేని పౌరసత్వంపై కౌంటర్ దాఖలు చేసేందుకు నెలరోజుల గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టును అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కేంద్రం నిర్ణయం తీసుకుందని …చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని ఏజీ కోర్టుకు తెలిపారు. ప్రజలు చెన్నమనేని రమేశ్‌ను కావాలనుకుంటున్నారని వెల్లడించారు.
జర్మనీ పౌరుడు పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని హైకోర్టుకు శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవి కిరణ్ తెలిపారు.
- Advertisement -