బీజేపీకి షాక్‌ల మీద్ షాక్‌‌…మరో కార్పొరేటర్‌పై అనర్హత వేటు!

349
Banoth Sujatha
- Advertisement -

తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా నలుగురు పిల్లలను కలిగి ఉన్నారని జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌పై అనర్హత వేటుకు రంగం సిద్ధంగా తాజాగా హస్తినాపురం డివిజన్‌ (16వ వార్డు) నూతన కార్పొరేటర్‌గా ఎన్నికైన బానోతు సుజాత (బీజేపీ)పై అనర్హత వేటుకు రంగం సిద్ధమైంది.

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సిటీ సిల్‌ కోర్టును హైకోర్టు ఆదేశించినట్లు టీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్‌ పద్మానాయక్‌ తెలిపారు. సుజాత నామినేషన్‌ వేసిన సందర్భంలో అధికారులకు అందజేసిన అఫిడవిట్‌లో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారని … 1995 తర్వాత ముగ్గురు పిల్లలు కలిగిన వారు ఎన్నికలలో పోటీకి అనర్హులనే నిబంధనను ఉల్లంఘించినట్లు ఆమె పేర్కొన్నారు.

సుజాతకు 1999 ఏప్రిల్‌ 16న బి.లక్ష్మి ప్రసన్న, 2000 జూన్‌ 10న బి.పూజిత, 2002 ఆగష్టు 5న బి.కార్తీక్‌ జన్మించినట్లు పూర్తి ఆధారాలతో గత డిసెంబర్‌ 7న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి, కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్లకు ఫిర్యాదు చేసినట్లు పద్మానాయక్‌ తెలిపారు. ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారని సుజాతపై ఫిబ్రవరి 2న ఎల్‌బీనగర్‌ పీఎస్‌లో, 3న ఎల్‌బీనగర్‌ డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

- Advertisement -