వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి లో రెండు ఎలక్ట్రిక్ ఆటోలు, 45మందికి రూ.44,80,220 విలువైన కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు, 9మందికి రూ. 4,28,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, 30మంది అంగన్ వాడి టీచర్ల కు యూని ఫార్మ్ లు, ముగ్గురు దివ్యంగులకు ట్రై సైకిల్స్ ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గారు కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా కొనసాగిస్తున్నారని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి జరుగుతున్నది. రైతులకు సాగు నీరు, 24గంటల ఉచిత విద్యుత్, పంటల పెట్టుబడి రైతు బంధు, రైతు భీమా, రుణాల మాఫీ, కొత్తగా రుణాలు, ఇంకా పంటల పెట్టుబడి వరకు అనేక పథకాలు ఒక్క రైతుల కోసమే అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలో ఒకే ఒక్క తెలంగాణ మాత్రమేనని మంత్రి వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కెసిఆర్ కిట్లు, ఆరోగ్య పథకాలు…ఇలా వందలాది పథకాలు అమలు అవుతున్నాయని మంత్రి వివరించారు. ఇలాంటి ముఖ్య మంత్రి మనకు దొరకడం మన అదృష్టమని మంత్రి అన్నారు.
పెళ్లి కోసం లగ్గం కోటు వేసుకున్నప్పుడే కల్యాణలక్ష్మి, షాది ముబా రక్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, వారి పెళ్లి అయిన కొద్ది రోజుల్లోనే నిధులు అందే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. త్వరలోనే ఆర్హులైన అందరికీ పెన్షన్లు, సొంత స్థలాలు ఉన్న నిరుపేదలకు ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసే పథకం మార్చి తర్వాత అమలు లోకి వస్తుంది. అలాగే, అన్ని బీసీ కులాల, వారి వృత్తుల, అభివృద్ధి కోసం బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం కెసిఆర్ ఆలోచిస్తున్నారని మంత్రి చెప్పారు.
మహిళల స్వయం సమృద్ధికోసం ప్రభుత్వం అతి తక్కువ, వడ్డీ లేని రుణాలు అందిస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మహిళలు మంచి పొదుపరులని ఎర్రబెల్లి అన్నారు. నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని, ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. స్త్రీ నిధి, ఐకేపీ నుంచి కూడా ఒక్క రాయపర్తి మండలానికే రూ.30కోట్ల నిధులు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూసుకోవాలని, అందరూ అభివృద్ధి చెంది, వారి జీవన ప్రమాణాలు పెరగాలన్నదే సీఎం కేసీఆర్, తన అభిమతమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.
కొన్ని రాజకీయ పార్టీల దుస్ప్రచారాల లో ప్రజలు కొట్టుక పోవద్దని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాల వల్ల రైతాంగం, ప్రజలు తీవ్రంగా నష్టోనున్నారని మంత్రి చెప్పారు.రోడ్డు వెడల్పు లో ఇండ్లు పోయిన వాళ్లకు ప్రభుత్వ బబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని, ఎవరూ కోర్టులకు వెళ్ళడం, ఇబ్బందులు పెట్టడం వంటి అభివృద్ధి నిరోధక చర్యలకు పాల్పడ వద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేందర్ జి , Drdo సంపత్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.