సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం మహిళా సాధికారికతకు పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. కాస్మోపాలిటన్ సిటీగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మేయర్, డిప్యూటీ మేయర్గా ఇద్దరు మహిళలను ఎంపిక చేయడం పట్ల సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
మహిళల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న నమ్మకానికి, గౌరవానికి జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపికే నిదర్శనమన్నారు. మహిళల సాధికారతకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు.
నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్ నాయకత్వంలో హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని ఆకాంక్షించారు. చారిత్రాత్మక నగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు.