సూర్యపేట మట్టంపల్లిలో పోలీసులు బీజేపీ నాయకులపై దాడికి పాల్పడటాన్ని ఖండించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్యంలో దాడులతో ఏం సాధించలేరని తెలిపారు.ఉనికి కోసమే సీఎంపై అవాకులు చవాకులు పెళుతున్నారని, ముఖ్యమంత్రిని దూషిస్తే ప్రతిపక్షాలకే పాపం తగులుతుందని స్పష్టం చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రతి ఎకరాకు నిళ్లించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని…డిండి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ సొరంగమార్గం, ఉదయ సముద్రం పనులకు కూడా వచ్చే ఏడాది నాటికి పూర్తిచేసే యోచనలో కేసీఆర్ ఉన్నారని వెల్లడించారు.
ఈ నెల 10న హాలియాలో జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేందుకు కూడా నిధులు మంజూరు చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంతటి అభివృద్ధి జరుగుతుంటే ప్రతిపక్షాలు నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.