విడాకుల తర్వాత హాయిగా ఉన్నా: శ్వేతా బసు

249
swetha
- Advertisement -

శ్వేతాబసు పరిచయం అక్కర్లేని పేరు.తెలుగు సినిమాల ద్వారానే హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత వ్యభిచారం కేసులో ఇరుక్కోవడం, కొంత కాలం పాటు పోరాడిన తర్వాత ఆ కేసు నుండి బయట పడటం అందరికీ తెలిసిందే. తొలి చిత్రం కొత్త బంగారులోకంతో మంచి టాలెంటెడ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న ఈ బెంగాలీ బ్యూటీ తాజాగా విడాకులపై స్పందించింది.

రోహిత్‌ మిట్టల్‌ అనే బాలీవుడ్‌ దర్శకుడిని పెళ్ళి చేసుకున్న శ్వేతాబసు వివాహ బంధం కేవలం ఎనిమిది నెలల్లోనే ముగిసింది. భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా శ్వేతా బసు తన భర్త నుంచి విడాకులు తీసుకుంది.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్వేతా…జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశానని, ముఖ్యంగా పెళ్ళి తర్వాత ఇప్పుడే స్వేచ్ఛగా జీవిస్తున్నానని చెప్పుకొచ్చింది. భర్తతో తెగతెంపులు చేసుకున్న తర్వాతే జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని… ఏదిఏమైన ప్రస్తుతం జీవితాన్ని హాయిగా గడుపుతున్నట్టు చెప్పారు.

- Advertisement -