చెన్నై టెస్ట్: జో రూట్ డ‌బుల్ సెంచ‌రీ

267
Joe Root
- Advertisement -

చెన్నై చిదంబ‌రం స్టేడియంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ చెలరేగిపోయాడు. భారత బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొంటున్నాడు. బుమ్రా, అశ్విన్, ఇషాంత్ వంటి అగ్రశ్రేణి బౌలర్లనూ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు. ఫలితంగా మొదటి టెస్టు రెండో రోజు రూట్ తనదైన శైలిలో ద్విశతకం సాధించాడు. అశ్విన్ వేసిన 143వ ఓవర్ 3వ బంతికి సిక్సర్ కొట్టి.. డబుల్ సెంచరీ మార్కును దాటాడు. ఫ్లాట్‌గా ఉన్న పిచ్‌పై చాలా సులువుగా రూట్ త‌న షాట్లు ఆడాడు. అత‌ని డ‌బుల్ సెంచ‌రీలో 19 ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి. నాలుగో వికెట్‌కు బెన్ స్టోక్స్‌తో క‌లిసి భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పిన రూట్‌.. స్టోక్స్ నిష్క్ర‌మ‌ణ త‌ర్వాత ద్విశ‌త‌కాన్ని అందుకున్నాడు.

బ్యాటింగ్‌కు అనుకూల‌మైన వికెట్‌పై రూట్ త‌న స్ట‌యిలిస్ ఆట‌ను కొన‌సాగించాడు. టాఫ్ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ చెన్నై మైదానంలోనూ త‌న ఆట‌తీరుతో అల‌రించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి రూట్ త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. బౌల‌ర్ల‌కు ఎటువంటి ఛాన్స్ ఇవ్వ‌లేదు. దీంతో టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో జో రూట్ స‌రికొత్త రికార్డు సాధించాడు. వంద‌వ టెస్టులో డ‌బుల్ సెంచ‌రీ చేసిన తొలి క్రికెట‌ర్‌గా ఘ‌న‌త సాధించాడు. రెండ‌వ రోజు టీ విరామ స‌మ‌యానికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల‌కు 454 ర‌న్స్ చేసింది.

- Advertisement -