మొక్కలు నాటిన నటుడు జాకీ..

279
Serial Actor Jackie
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు సినీ నటుడు జాకీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనకు ఆరోగ్యం, అందం కావాలన్న ప్రతి ఒక్కరం చెట్లు పెట్టాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించి అందమైన ఆస్వాదన్ని పొందవచ్చని సినీ నటుడు జాకీ తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మార్పును తీసుకొస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్టిస్ట్ హరిత విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ అజీజ్ నగర్‌లో మొక్కలు నాటి అనంతరం మరో ముగ్గురు (ఆర్టిస్ట్ లు లక్స్మి ప్రియ, జ్యోతి రెడ్డి, నాగభైరవ సీరియల్ డైరెక్టర్ వరాంజనేయులు) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్‌ను విసరాలని సినీ నటుడు జాకీ పిలుపునిచ్చారు.

- Advertisement -