గ్రేటర్ మేయర్ ఎన్నిక..ఏర్పాట్లు షురూ

171
ghmc
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు మొదలయ్యాయి. ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక జరగనుండగా అదేరోజు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి పర్యవేక్షించారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ఎన్నికల విభాగం అధికారులు, కార్యదర్శులతో సమావేశమైన అనంతరం కౌన్సిల్‌హాల్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. ఎక్స్‌అఫీషియో, కార్పొరేటర్లకు పార్టీల వారీగా సీట్ల కేటాయింపు, కౌన్సిల్‌ హాల్‌లోకి ప్రవేశం, మీడియా ఎన్‌క్లోజర్‌ తదితరాంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 11న జరిగే సమావేశాన్ని పూర్తిగా వీడియోలో చిత్రీకరించాలని ఆమె ఆదేశించారు.

మేయర్ సీటును జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో టీఆర్ఎస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. మేయర్ రేసులో భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శరెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ,కేకే కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి,బంజారాహిల్స్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక డిప్యూటీ మేయర్ పదవి కోసం కూడా టీఆర్ఎస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుత డిప్యూటీ మేయర్ బాబాను మళ్లీ కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

- Advertisement -