సైబర్ సేఫ్టీపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం..

125
cp
- Advertisement -

సైబర్ సేఫ్టీపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు సీపీ అంజనీ కుమార్. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు సైబర్ నెరగాళ్లపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు సైబర్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాన్ని హైదరాబాద్ బషీర్ బాగ్ లోని కమిషనర్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు.

విద్యార్థులు ,పాఠశాలల యాజమాన్యాలు ఆన్లైన్ సైబర్ నెరగాళ్లతో ఎలా అప్రమత్తం ఉండాలో 100 స్కూల్స్ యాజమాన్యాలు, విద్యార్థులతో హైదరాబాద్ సిటీ సెక్యూరిటి కౌన్సిల్ ద్వారా సీపీ అంజనీకుమార్, పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

విద్యార్థులు,ఆన్లైన్ క్లాస్సెస్, మొబైల్ వాడడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 100పాఠశాలలకు మొదటి దశగా అవగాహన కల్పించారు.

- Advertisement -