రైతు ఆందోళనలపై పార్లమెంట్‌లో చర్చ!

133
parliament
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని దేశరాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలు తీవ్రంగా సాగుతుండగా పార్లమెంట్‌లో రైతుల ఆందోళ‌న‌పై 15 గంట‌ల పాటు చ‌ర్చ‌కు ప్ర‌భుత్వం అంగీక‌రించింది.

రాజ్యసభలో ఈ చర్చ జరగనుండగా బుధ‌వారం ప్ర‌తిప‌క్షాల‌తో స‌మావేశ‌మైన త‌ర్వాత ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కేవ‌లం రైతుల ఆందోళ‌న‌ల‌పైనే ఐదు గంట‌ల పాటు చ‌ర్చ జ‌ర‌పాల‌ని 16 ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌ట్టుబ‌ట్టాయి. అయితే ప్ర‌భుత్వం దానిని 15 గంట‌ల‌కు పెంచ‌డానికి అంగీక‌రించింది. చ‌ర్చ‌కు తాము కూడా సిద్ధంగా ఉన్నామ‌ని కాంగ్రెస్ నేత గులాం న‌బీ ఆజాద్ చెప్పారు.

- Advertisement -