గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న తమిళ నటుడు శశికుమార్..

151
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు తమిళ నటుడు,సింగర్,ప్రొడ్యూసర్ శశికుమార్‌. చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు.

నటి జయ ప్రకాశ్‌ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి తాను మొక్కలు నాటానని తెలిపిన శశికుమార్‌…ఎంపీ సంతోష్ కుమార్ గొప్ప కార్యాక్రమం చేపట్టారని తెలిపారు. మొక్కలు నాటాడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపిన శశివకుమార్ ప్రతిఒక్కరూ మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాలన్నారు.నటుడు సముద్రఖని, నిఖిల్ విమల్,నటి అంజలికి గ్రీన్ ఛాలెంజ్ ఇస్తున్నానని తెలిపారు.

- Advertisement -