తెలంగాణకు జాతీయ మైనారిటీ కమిషన్ ప్రశంసలు..

229
cs
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో షాదీ ముబారక్ వంటి వినూత్న పథకాలను ప్రారంభించినందుకు జాతీయ మైనారిటీల కమిషన్ వైస్ చైర్మన్ అతిఫ్ రషీద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ పథకాలు విప్లవాత్మకంగా ఉన్నాయని మరియు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా ఉంటాయని అన్నారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో ప్రధాన మంత్రి నూతన 15 సూత్రాల కార్యక్రమం అమలు, మైనారిటీ సంక్షేమం మరియు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై జాతీయ మైనారిటీల కమిషన్ వైస్ చైర్మన్ అతిఫ్ రషీద్ అధికారులతో సమీక్షించారు.

రాష్ట్రంలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను విజయవంతంగా నడుపుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. క్రైస్తవుల సంక్షేమం కోసం చేపడుతున్న స్మశానవాటికలు, ఆర్ధిక సహాయ పథకాలు, క్రిస్మస్ బహుమతులు వంటి వివిధ పథకాలను జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు కొనియాడారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమం పై అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి మైనారిటీ సంక్షేమంపై గల దార్శనికతను తెలియచేస్తు షాదీ ముబారక్, ముఖ్యమంత్రి విదేశి విద్య స్కాలర్ షిప్ పథకం, తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్ పాఠశాలలు తదితర అంశాలపై సాధించిన ప్రగతిని వివరించారు. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలపై ఈ సందర్భంగా మైనార్టీ కార్యదర్శి అహ్మద్ నదీమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సమావేశంలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్,హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్,జీఓఐ మైనార్టీ సంక్షేమ జాయింట్ సెక్రటరీ డేనియల్ రిచర్డ్స్, డైరెక్టర్ శ్రీమతి ధనలక్ష్మి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి S.A.M రిజ్వీ, మహిళా,శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీ షఫియుల్లా, ఇంటర్మిడియేట్ విద్యా కమీషనర్ ఒమర్ జలీల్, పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన,తెలంగాణ రాష్ట్ర క్రిష్టియన్ (మైనారిటీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ AHN కాంతివెస్లే, మైనారిటీస్ సంక్షేమ డైరెక్టర్ షాన్ వాజ్ ఖాసిం తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -