మొక్కలు నాటిన యాంకర్ దీప్తి వాజపేయి..

534
Anchor Deepthi Vajpayee
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ దీప్తి వాజపేయి మొక్కలు నాటారు.ప్రపంచంలో గ్రీన్ అనేది ఒక గొప్ప కలర్ అని ప్రముఖ యాంకర్ దీప్తి దీప్తి వాజపేయి తెలిపారు. మనకు ఆరోగ్యం, అందం కావాలన్న ప్రతి ఒక్కరం చెట్లు పెట్టాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించి అందమైన ఆస్వాదన్ని పొందవచ్చని యాంకర్ దీప్తి దీప్తి వాజపేయి తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మార్పును తీసుకొస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌ కృతజ్ఞతలు తెలుపుతూ యాంకర్ ప్రత్యూష ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటి అనంతరం మరో ముగ్గురు ( ఏపీ సిఐడి చీఫ్ పి.వి సునీల్ కుమార్ , నటి బిగ్ బాస్ ఫేమ్ అర్చన శాస్త్రి , ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి పట్నాయక్ ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ను విసరాలని యాంకర్ దీప్తి వాజపేయి తెలిపారు.

- Advertisement -