వారణాసిలో పర్యటించిన‌ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు..

249
mlc kavitha
- Advertisement -

సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు గురువారం వారణాసిలో పర్యటిస్తున్నారు. సీఎం సతీమణి శోభ, కూతురు, ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబ సభ్యులు కాశి విశ్వేశ్వరుడి దర్శనానికి వారణాసి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులతో కలిసి అస్సీ ఘాట్‌ నుండి దశాశ్వమేధ ఘాట్‌ వరకు బోట్‌లో ప్రయాణించారు. గంగా నది బోటులో విహరిస్తూ అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. బెనారస్‌ ప్రజలతో ఆహ్లాదకరమైన సంభాషణ జరిగినట్లుగా కవిత ట్విట్టర్‌ ద్వారా తమ పర్యటన విశేషాలను పంచుకున్నారు. దశాశ్వమేధ ఘాట్‌లో గంగానదికి హారతి ఇచ్చారు. ఆ తరువాత ప్రాచీన సంకట్‌ మోచన్‌ హనుమాన్‌ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -