- Advertisement -
కొన్ని హోటళ్ల పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. చూడగానే.. అక్కడికి వెళ్లి ట్రై చేద్దాం అనిపిస్తుంది. అంతేకాదు.. సెల్ఫీ తీసుకుని సరదాగా సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి కూడా భలే బాగుంటాయి. అలాంటి కొన్ని హోటళ్ల పేర్లను ఇక్కడ అందిస్తున్నాం. వీలైతే.. మీరు అక్కడికి వెళ్లి.. కడుపు నిండా తిని మాంచి సెల్ఫీ తీసుకోండి.
ఒకప్పుడు మీకు తెలిసిన మాంచి వెరైటీ హోటల్ పేరు చెప్పండి అని అడిగితే మీరు ఏం చెబుతారు?.. కొంచెంసేపు ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఎన్నోరకాల వరైటీ హోటల్స్ పేర్లు చెబుతున్నారు. అలాంటివి మన హైదరాబాద్లోని వివిధ హోటళ్లకు కూడా ఉన్నాయి. అయితే, ఆ పేర్లు చాలా తేడాగా ఉంటాయి. నవ్వించడమే కాకుండా కస్టమర్లను కూడా బాగానే ఆకట్టుకుంటాయి. మరి అవి ఏంటో మీరూ చూడండి.
హైదరాబాద్ నగరంలో వింత పేర్లున్న ఆహారశాలలు (ప్రాంతం)..
- ఉప్పు కారం (కొండాపూర్)
2.ఆహా (షేక్ పేట్)
3.తెలుగింటి రుచులు (కూకట్ పల్లి) - అద్భుతః (దిల్సుఖ్ నగర్)
- రాజుగారి రుచులు (కొండాపూర్)
- మా పల్లె వంటకాలు (గచ్చిబౌలి)
- వియ్యాలవారి విందు (ఎల్.బి. నగర్, మాధాపూర్)
8.కోడికూర, చిట్టిగారె (జూబిలీ హిల్స్, కొండాపూర్) - అరిటాకు భోజనం (అమీర్ పేట్)
- దిబ్బరొట్టి (మణికొండ)
11.వివాహ భోజనంబు (జూబిలీ హిల్స్) - తాలింపు (అమీర్ పేట్)
- తినేసి పో (కొంపల్లి)
14.బకాసుర (ఏఎస్ రావు నగర్ ) - నాగోల్ మెట్రో – తిన్నంత భోజనం
- Advertisement -