ఉపాధ్యాయ సంఘాలతో సీఎస్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ భేటీ..

179
cs
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటితో గురువారం బిఆర్ కెఆర్ భవన్‌లో పిఆర్ టి యు టిఎస్, తెలంగాణ క్లాస్ 4 ఎంప్లాయిస్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్, ట్విన్ సిటీస్ తెలంగాణ గవర్నమెంట్ డ్రైవర్ సెంట్రల్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమైయ్యారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, కమిటి ఐదు అసోసియేషన్ల సభ్యులతో విడివిడిగా సమావేశమై పిఆర్సి రికమెండేషన్స్, ఇతర ఉద్యోగ సమస్యలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు విన్నారు. పిఆర్ సి రికమెండేషన్స్‌పై యూనియన్ సభ్యులు విన్నవించిన అంశాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకువెళ్తానని సి.ఎస్ వారికి హామి ఇచ్చారు.

ఈ సమావేశంలో పీఆర్‌టీయూటీఎస్‌ నుండి ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి,ప్రెసిడెంట్ పి.శ్రీపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వి.కమలాకర్ రావు, ఇన్నారెడ్డి,పి.శ్రీనివాస్ రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్‌ నుండి ప్రెసిడెంట్ కె.జంగయ్య, జనరల్ సెక్రటరి చావా రవి, ట్రెజరర్ టి లక్ష్మారెడ్డి, సెక్రటరీలు యం.రాజశేఖర్ రెడ్డి, ఎ.వెంకట్, వైస్ ప్రెసిడెంట్ సి.హెచ్ దుర్గా భవాని, రెవెన్యూ అసోసియేషన్ నుండి ప్రెసిడెంట్ వంగ రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కె.గౌతం కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మన్నే ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ రావు, సెక్రటరీ బానాల రామ్ రెడ్డి, నాగమణి, మాధవి రెడ్డి, నాల్గవతరగతి ఉద్యోగుల సంఘం నుండి అధ్యక్షులు జి. జ్ఞానేశ్వర్, ఖాధర్ బిన్ హసన్, పి. లక్ష్మణ్ రావు, కె.ధన్ రాజ్, ఎ.సత్యరాజ్, ఎస్.క్రిష్ణవేణి, డ్రైవర్స్ అసోసియేషన్ నుండి అధ్యక్షులు ఎ.శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ కె.నర్సింగ్ రావు, జనరల్ సెక్రటరీ మహ్మద్ యూసుఫ్ ఉద్ధీన్, చంద్రశేఖర్, యండి జలీలుద్ధీన్ తదితరులు ఈ చర్చలలో పాల్గొన్నారు.

- Advertisement -