ఆర్ధిక వ్యవస్థను ఎలా నాశనం చేయాలో మోదీని చూసి నేర్చుకోవాలి..

136
rahul
- Advertisement -

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేరళలో పర్యటించారు కాంగ్రెస్ నేత,ఎంపీ రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఆర్ధిక వ్యవస్థను ఎలా నాశనం చేయాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని చూసి నేర్చుకోవచ్చని ఎద్దేవా చేశారు రాహుల్.

ఆర్థిక వ్యవస్థల్లో ఒక దాన్ని ఎలా నాశనం చేయాలనే విషయంలో మోడీ పాలన ఒక పాఠం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలు దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)ను నాశనం చేశారని ఆరోపించారు.

లాక్‌డౌన్‌ సమయంలో భారత బిలియనీర్ల సంపద 35శాతం పెరిగగా దీనిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. మార్చిలో లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి టాప్ 100 బిలియనీర్లకు వచ్చిన ఆదాయం.. 138 మిలియన్ల పేద భారతీయులకు ప్రతి ఒక్కరికీ 94,045 డాలర్లు ఇవ్వొచ్చని ఓ నివేదక పేర్కొంది.

- Advertisement -