సంతోష్ బాబు స్పూర్తితో ముందుకుసాగుతా: సంతోషి

164
santhoshi col
- Advertisement -

భారత ప్రభుత్వం ప్రకటించిన.. “మహావీర చక్ర” పథకం ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి. యాదాద్రిలో మాట్లాడిన ఆమె… తన భర్త కల్నల్ సంతోష్ బాబు వీర మరణం గుర్తింపుగా.. దేశంలో రెండో అత్యున్నత పురస్కారం “మహావీర్ చక్ర” రావడం గౌరవంగా భావిస్తున్నాం అన్నారు.భారత ప్రభుత్వం ఇచ్చిన పథకం తమకు ఎంతో ప్రత్యేకమని….భారతీయులందరికీ ప్రేరణ అన్నారు.

భారత ఆర్మీ.. కల్నల్ సంతోష్ బాబుకు ఘన నివాళిగా భావిస్తున్నానని తెలిపిన సంతోషి…సంతోష్ బాబు ఇచ్చిన స్ఫూర్తితో.. జీవితంలో ముందుకు సాగుతానని వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యారు.

- Advertisement -