పవన్ కొత్త సినిమా షూటింగ్‌ షురూ.. వీడియో వైరల్‌..

185
Pawan Kalyan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తున్నారు. జ‌న‌వ‌రి 25 నుండి చిత్ర షూటింగ్ మొద‌లు కాగా, ఈ రోజు రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఓ వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్.

తాజాగా విడుద‌లైన వీడియోలో ప‌వ‌న్ లొకేష‌న్‌లో అడుగుపెట్ట‌డం, చిత్ర ద‌ర్శ‌కుడు, త్రివిక్ర‌మ్‌తో మంత‌నాలు చేయ‌డం ఫైన‌ల్‌గా బుల్లెట్‌పై ర‌య్యిమంటూ వెళ్ల‌డం వంటి స‌న్నివేశాలు చూపించారు. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో పది రోజులపాటు యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జరగనుందని మేకర్స్ తెలిపారు. ఈ షెడ్యూల్‌లో ప‌వ‌న్‌తో పాటు రానా, సాయి ప‌ల్ల‌వి, ఐశ్వ‌ర్య రాజేష్ కూడా జాయిన్ కానున్న‌ట్టు తెలుస్తుంది. సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -