దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి- మంత్రి కొప్పుల

163
minister koppula
- Advertisement -

ఈ రోజు హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో దివ్యాంగుల సంక్షేమం సంబంధిత అధికారులతో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు అన్ లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దివ్యాంగుల సంక్షేమానికి అంకితభావంతో కృషి చేస్తున్నారు మంత్రి కొప్పుల.

దివ్యాంగులకు 3,0,16 చొప్పున 4,95,058 మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇందుకోసం ఏటా 18 వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.కేసీఆర్ ఆదేశాల మేరకు దివ్యాంగులకు ఉపకరణాలను ఉచితంగా అందజేస్తామన్నారు.కేసీఆర్‌కు, మాకు దివ్యాంగుల పట్ల ప్రేమ, ఆదరణ ఉంది. 13,195 మందికి ఉపకరణాలు అందించడం జరుగుతున్నది. ఇందుకు 20కోట్ల 41లక్షలతో ఉపకరణాలు కొనుగోలు చేయడం జరిగింది. దీనిని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి దివ్యాంగులకు ఇంతపెద్ద ఎత్తున ఉపకరణాలను ఉచితంగా అందించడం భారత దేశంలోనే మొదటిసారి. వీటి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్​లైన్​లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని మంత్రి వెల్లడించారు.

90 వేల రూపాయలు విలువ చేసే 900 రెట్రోఫిట్టెడ్ త్రిచక్ర వాహనాలు, 650 బ్యాటరీ వీల్​ఛైర్స్​, 304 లాప్​టాప్స్​, 400 జీ స్మార్ట్​ ఫఫోన్స్,1460 వినికిడి యంత్రాలు, 2065 చేతికర్రలు, 800 ఎంపీ 3 ప్లేయర్స్, 2 వేలు వీల్ ఛైర్లు, 3 వేల చంకకర్రలు,1500 త్రిచక్ర వాహనాలు, 120 డైసీ ప్లేయర్స్ పంపిణీ చేస్తామన్నారు. వీటికోసం నేటి నుంచి ఫిబ్రవరి 6 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని మంత్రి సూచించారు.

ఇందు కోసం www.obmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత గల దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నాము. జిల్లా కమిటీలు ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ఫిబ్రవరి 15 నుంచి ఉపకరణాలను అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉచితంగా అందజేస్తారు అని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.

- Advertisement -