మెగాస్టార్ చిరంజీవి తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత వెండితెరపై మెరుపులు మెరిపించాడు. తన నటనలో ఏమాత్రం మార్పు రాకుండా అదే స్థాయిలో డ్యాన్స్, డైలాగ్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ డైలాగ్స్‌తో అమ్మడు లెట్స్‌డూ కుమ్ముడు అంటూ యంగ్ హీరోలను మరిపించేలా స్టెప్టులేసిన చిరు బాక్సాఫీసు రికార్డులను చెరిపేశాడు. సినిమా టీజర్ దగ్గరి నుంచి విడుదల వరకు టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది ఖైదీ నెంబర్ 150. సినిమా టీజర్ దగ్గర నుంచి మొదలు విడుదల వరకు నానా హంగామా చేసింది ఖైదీనెంబర్ 150. చిరు రీఎంట్రీ పై మెగా అభిమానులే కాదు టాలీవుడు దర్శకులు కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇప్పటికే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ఖైదీ నెంబర్ 150 చిరు కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోయింది. అటు రాంచరణ్ నిర్మాతగా అడుగువేసిన మొదటి సినిమా అనుకున్న దానికంటే ఎక్కువగానే హిట్ అవడం… భారీగా కలెక్షన్లు రాబట్టడం ఇదంతా ఒక పండుగల ఉందని మెగాఫ్యామిలి మెంబర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారట. ఇదే ఊపుతో చిరు 151ని తానే నిర్మిస్తున్నట్లు ప్రకటించాడు చెర్రీ.
ఇక తాజాగా చిరు 152వ సినిమా కూడా కన్ఫామైపోయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించనున్నాడు. ఈ సినిమాను మెగా ప్రొడ్యుసర్ అశ్వినిదత్‌తో కలిసి టి సుబ్బిరామిరెడ్డి నిర్మించనున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
ఈ సందర్భంగా నిర్మాత కళా బంధు టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ….గతం లో మెగాస్టార్ చిరంజీవితో ‘స్టేట్ రౌడీ’ వంటి ఘనవిజయం సాధించిన చిత్రాన్ని నిర్మించాను. అప్పట్లో ఆ చిత్రం నైజామ్ ప్రాంతం లో సరికొత్త రికార్డ్ సృష్టించింది . అలాగే శోభన్ బాబు, రజనీకాంత్ లతో ‘జీవనపోరాటం’, యువరత్న బాలకృష్ణ తో ‘వంశోద్ధారకుడు’, విక్టరీ వెంకటేష్ , అర్జున్,నరేష్ లతో ‘త్రిమూర్తులు’, ‘సూర్య ఐ.పి.ఎస్.’ మరియు సంస్కృతంలో ‘భగవద్గీత’ వంటి తదితర చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా నిర్మించనున్నాను అని సంతోషంగా తెలియచేస్తున్నాను. అరుదైన ఈ కాంబినేషన్ ఇది . మెగా బ్రదర్స్ ఇద్దరిని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కరే డైరెక్ట్ చేయగలరనేది నా నమ్మకం. త్రివిక్రమ్ ని ఈరోజు కూడా కలిసి చర్చించటం జరిగింది. ఆయన కూడా తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. గ్రేట్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తో కలిసి ఈచిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాను. త్వరలోనే ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలను మీడియాతో పంచుకోవటం జరుగుతుందని టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. చిరు, పవన్ కలయికలో సినిమా వస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.