కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌పై సీఎం కేసీఆర్ సంతృప్తి..

230
kcr
- Advertisement -

కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌పై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం… తెలంగాణ సాగునీటి ముఖ చిత్రాన్ని కాళేశ్వరం మార్చివేసిందని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడంలో కృషి చేసిన నీటిపారుదల శాఖాదికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రస్తుతం బ్యారేజీల వద్ద పూర్తి స్థాయిలో నీరు నిలువ ఉందని, ఈ ఎండాకాలం అంతా ఈ నీటితో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ రూల్స్ రూపొందించి అమలు చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్పూర్తితోనే రాష్టంలో చేపట్టిన ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఎదురైన అనుభవాలను సీఎం గుర్తుచేసుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన స్పూర్తితోనే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన తూపాకులగూడెం బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన దుమ్ముగూడెం బ్యారెజీ నిర్మాణాలు శరవేగంగా జరగుతున్న‌ట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీంటిని త్వరితిగతిన పూర్తి చేసి రైతుల సాగునీట గోసను శాశ్వతంగా రూపుమాపాల‌న్న‌ది త‌మ‌ ప్రభుత్వ లక్ష్యం అని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.

సాగునీరు లేక తెలంగాణ రైతాంగం దశాబ్దాల తరబడి గోసను అనుభవించిందని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే రైతులు రెండు పంటలను సమృద్ధిగా పండించేందుకు అవసరమైన సాగునీరు అందించి తీరాలని మొదట్లోనే నిర్ణయించుకున్న‌ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటిపారుదలశాఖ ఈఎన్‌సీలు మురళీధరర్ రావు, వెంకటేశ్వర్లు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, పెద్దపలి-వరంగల్ రూరల్ జడ్పీ చెర్ పర్సన్లు పుట్ట మధు, గండ్ర జ్యోతి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట్రామరెడ్డి, పోర్తిక చందర్, దివాకర్ రావు, మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పురాణం సతీష్, నారదాసు లక్మ్తణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -