- Advertisement -
కరోనా కష్ట కాలంలో రియల్ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించిన నటుడు సోనూసూద్. తాజాగా అంబులెన్స్ సర్వీస్‌ని ప్రారంభించి ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందకు వస్తున్నాడు. ఇటీవల కొనుగోలు చేసిన వ్యాన్స్‌ను సోనూ వాటిని అంబులెన్స్‌లుగా మార్చి ప్రజలకు సేవ చేసేందుకు అంబులెన్స్‌లను ప్రారంభించారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో అంబులెన్స్‌లను ప్రారంభించిన సోనూ….రానున్న రోజుల్లో వీటిని మరింతగా విస్తృతం చేస్తామని తెలిపాడు. అంతేకాకుండా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో మెడికల్ సర్వీస్‌లను అందుకోలేని వారికి ఇవి సహాయం చేస్తాయని, వీటి ద్వారా సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి చేయూతనిచ్చి రక్షించ గలుగుతామని సోనూ అన్నాడు.
- Advertisement -