బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరాని, కేసీఆర్ పై అవాకులు చవాకులు పేలితే ఖబడ్దార్ అని హెచ్చరించారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. నాగార్జున సాగర్ లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన బీజేపీ, కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ అదో:గతి పాలైందని మండి పడ్డారు. నల్గొండ జిల్లా లో ఫ్లోరైడ్ భూతాన్ని పెంచి,ప్రజలను నరకయాతన పెట్టిన జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డి లకు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.
టీఆర్ఎస్ ఆరేళ్ళ పాలనలో ఇంటింటికి కృష్ణా జలాలను అందించి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని అన్నారు…ఉమ్మడి నల్గొండ లో మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటు, యాదాద్రి పవర్ ప్లాంట్,దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం,చేసి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని జగదీష్ రెడ్డి అన్నారు…ఇక కేంద్రం లో ఉన్న మోడీ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలను దోచుకుంటున్నది బీజేపీ అని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.
రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు లక్ష ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగులను సీఎం కేసీఆర్ కల్పించారని,మరో యాభై వేల ఉద్యోగులాను త్వరలోనే భర్తీ చేస్తున్నారని అన్నారు……ప్రజలను మభ్యపెడుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలను ప్రజాలేవ్వరు పట్టించుకోరని పల్లా అన్నారు……సందర్భం ఏదైనా తెలంగాణ సమాజం అంత కేసీఆర్ వెంట నడుస్తుందని అన్నారు.