మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అల్లు అరవింద్ సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్స్‌పై అల్లు వెంకటేశ్‌తో పాటు సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలైంది.
వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశాడు. ఈ సినిమా పేరు గనీ అని ఆ సినీ యూనిట్ ప్రకటించింది. ఈ పోస్టర్‌లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ వరుణ్ తేజ్ కనిపిస్తున్నాడు. వరుణ్‌తేజ్ సరికొత్త గెటప్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో వరుణ్‌కు జోడీగా సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.