గబ్బా టెస్టులో టీమిండియా బౌలర్లు హవా..

270
India vs Australia
- Advertisement -

గబ్బా టెస్టులో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఆస్ట్రేలియా పటిష్ఠ స్థితికి చేరింది. తొలి ఇన్నింగ్స్ లో 33 పరుగుల లీడ్ ను సంపాదించిన తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జట్టులో ఓపెనర్లు మార్కస్ హారిస్, డేవిడ్ వార్నర్ లు రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 89 పరుగులు జోడించిన తరువాత మార్కస్ హారిస్ అవుట్ కాగా, ఆపై 91 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ పెవీలియన్ కు చేరాడు. ఆ తరువాత జట్టు స్కోరు 123 పరుగుల వద్ద మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో మార్నస్ లబుషేన్, మ్యాథ్యూ వేడ్ లు అవుట్ కావడంతో, భారత జట్టు ఆశలు పెరిగాయి. అయితే, అప్పటికే క్రీజులో ఉన్న స్టీవ్ స్మిత్ కు కామెరాన్ గ్రీన్ తోడై జట్టు స్కోరును నిదానంగా ముందుకు నడిపించాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు కాగా, స్మిత్ 42, గ్రీన్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా 206 పరుగుల లీడ్ లో ఉంది. టీమిండియా బౌలర్లు మరోమారు మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 21/0తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ కీలక ఆటగాళ్లను తొలి సెషన్‌లో పెవిలియన్‌కు పంపారు. డేవిడ్‌ వార్నర్ ‌(48), మార్కస్ హేరిస్‌ ‌(38), మార్నస్‌ లబుషేన్‌(25), మాథ్యూ వేడ్ (డకౌట్‌) వికెట్లను తీశారు.మహ్మద్‌ సిరాజ్‌ రెండు, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్ ఠాకూర్‌‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 369 పరుగులకు ఆలౌట్‌ కాగా టీమిండియా 336 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ అర్ధ శతకాలతో జట్టును ఆదుకున్నారు. వారిద్దరూ ఏడో వికెట్‌కు అమూల్యమైన 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

- Advertisement -