- Advertisement -
తిరుపతిలో కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ఉదయం కుటుంబం సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన కొప్పుల ఈశ్వర్ కు వేదపండితులు ఆశీర్వచంన, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ స్వామివారి దర్శన భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
- Advertisement -