మెగా హీరో మూవీ ప్రమోషన్‌లో మహేష్‌

222
Mahesh babu for sai daram winner Promotion
- Advertisement -

టాలీవుడ్‌లో మెగా, నందమూరి, ఘట్టమనేని ఫ్యామిలీలది ప్రత్యేక స్ధానం. ఈ మూడు కుటుంబాల నుంచి ఎంతోమంది హీరోలు వచ్చి ఇండస్ట్రీలో తమకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యక్తిగతంగా వారి మధ్య ఎలాంటి విభేదాలు లేకున్న వారి అభిమానులు మాత్రం తమ హీరో గొప్ప అంటే కాదు తమ హీరోనే గొప్పఅంటూ పోటీ పడుతుంటారు. అయితే కొంతకాలంగా టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. అభిమానులకు మేమంతా ఒక్కటే అని చాటిచెప్పడానికి చాలా ప్రయత్నాలనే చేశారు. ఈ సారి అలాంటి సందర్భానికి వేదికైంది మెగా హీరో కొత్త సినిమా.

 Mahesh babu for sai daram winner Promotion

వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్.  హీరోగా తెరకెక్కిన సినిమా విన్నర్.ధరమ్ తేజ్ హీరోగా జవాన్ అనే టైటిల్ తో సరికొత్త మూవీ తెరకెక్క నుంది. బీవీఎస్ రవి దర్శకత్వంలో తీస్తున్న ఈ చిత్రాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు.

 Mahesh babu for sai daram winner Promotion

తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు కూడా మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ సినిమాను ప్రమోట్ చేయడానికి తన వంతు కృషి చేస్తున్నాడు. తన సోషల్ మీడియా పేజ్ లో ఈ సినిమాలోని ఓ పాటను మహేష్ రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్… తన సినిమా లొకేషన్ నుంచే ‘సితార’ అనే పాటను రిలీజ్ చేస్తున్నాడు. మహేష్ కుమార్తె పేరు కూడా సితార కావడంతో… ఈ పాటను అతని చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నారు.

‘విన్నర్’ సినిమా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా… పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.

 

- Advertisement -