మహబూబ్‌నగర్‌లో ఏరో స్పోర్ట్స్,పారా మోటార్ ఛాంపియన్ షిప్‌ను ప్రారంభించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్…వలస జిల్లాగా పేరొందిన మహబూబ్‌నగర్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
త్వరలోనే అతిపెద్ద పరిశ్రమ మహబూబ్‌నగర్ జిల్లాకు రాబోతుందన్నారు. దేశంలోనే తొలి ఏరో స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను జిల్లాలో ఏర్పాటు చేస్తామన్నారు. కరివేన-ఉద్ధండాపూర్ రిజర్వాయర్ల మధ్య కేటాయిస్తామన్నారు.
ఐదు రోజులు ఆకాశంలో మోటార్ పైలెట్ల విన్యాసాలు జరుపడం, పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఎయిర్ షో, పారామోటార్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గతేడాది కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించినట్లు గుర్తు చేశారు. అన్ని రంగాల్లో పాలమూరు జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు.