ఎఫ్‌ 2(ఫన్ అండ్ ఫ్రస్టేషన్)కి రెండేళ్లు!

165
f2
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఎఫ్‌ 2 ( ఫన్ అండ్ ఫ్రస్టేషన్) ఇండస్ట్రీ ఆల్‌ టైం హిట్‌ మూవీల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీతో సరికొత్త ఫన్‌ని క్రియేట్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి.

వెంకీ (వెంక‌టేష్‌) ఓ ఎమ్మెల్యే ద‌గ్గ‌ర పీఏ ప‌నిచేస్తుంటాడు. హారిక‌(త‌మ‌న్నా), హ‌నీ(మెహ‌రీన్‌) అక్కా చెల్లెళ్లు. హారిక‌ను పెళ్లి చేసుకుంటాడు వెంకీ. అప్పటివ‌ర‌కూ సాఫీగా సాగిపోతున్న వెంకీ జీవితం పెళ్లితో ఒక్క‌సారిగా మారిపోతుంది. సీన్ కట్ చేస్తే వ‌రుణ్ యాద‌వ్‌(వ‌రుణ్‌తేజ్‌) హ‌నీని ఇష్ట‌ప‌డ‌తాడు. అప్ప‌టికే అత్తింటి ప‌రిస్థితులు అర్థ‌మైన వెంకీ.. హ‌నీని పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని వ‌రుణ్‌యాద‌వ్‌ను హెచ్చ‌రిస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది..?కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే ఎఫ్‌ 2 కథ.

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ వెంక‌టేష్,ఫస్టా ఫ్,డైలాగ్‌లు. చాలా కాలం తర్వాత వెంకీ తనదైన కామెడీతో నవ్వులు పూయించారు. సినిమా మొత్తం వెంకీ నవ్వులు పూయించారు. వ‌రుణ్ తేజ్ కూడా చ‌క్క‌గా న‌టించాడు. తెలంగాణ యాస‌లో అదరగొట్టాడు.చాలా రోజుల తర్వాత త‌మ‌న్నా తన పర్ఫామెన్స్‌తో అదరగొట్టింది. మెహ‌రీన్,ర‌ఘుబాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాష్‌రాజ్‌, నాజ‌ర్‌లు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

సాంకేతికంగా సినిమా బాగుంది. ర‌చ‌యిత‌గా అనిల్‌రావిపూడి స‌క్సెస్ అయ్యాడు. మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కూ సినిమా ఒకేలా ఉంది. దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం బాగుంది. కెమెరా ప‌రంగా క‌ల‌ర్‌ఫుల్‌గా ఉందీ సినిమా. సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్ బాగుంది. దిల్ రాజు నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.నువ్వునాకు న‌చ్చావ్‌, మ‌ల్లీశ్వ‌రీలాంటి చిత్రాల తర్వాత మళ్లీ అలాంటి పాత్రతో వెంకీ..వరుణ్‌ తేజ్‌తో చేసిన మల్టీస్టారర్ ఎఫ్‌ 2. దర్శకుడు చేసిన ప్రయోగం ఫన్ అండ్ ప్రస్టేషన్‌ వందశాతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

- Advertisement -