నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ పరిసరాలు, నర్సాపూర్ – హైదరాబాద్ వెళ్లే రోడ్డు నందు ప్లాస్టిక్ ఫ్రీ డ్రైవ్ ను అటవీ శాఖ నిర్వహించింది. దీనిలో మెదక్, నర్సాపూర్ రేంజ్ అటవీ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, యానిమల్ వారియర్స్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు ఒక టన్ను ప్లాస్టిక్ మెటీరియల్ రోడ్డు పక్కన సేకరించారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అటవీ అధికారి వి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వస్తువులను అర్బన్ పార్క్ పరిసరాలకు తేవద్దని, అటవీ ప్రాంతాలను కూడా పార్క్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా గుర్తించారని, ఎలాంటి ప్లాస్టిక్ వస్తువు లైనా పార్క్ లోనికి నిషేధమన్నారు. ప్లాస్టిక్ వాడినా, విసిరినా జరిమానా విధిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవుటకు దాదాపు వంద సంవంత్సరాలు పడుతుందని, ప్లాస్టిక్ వల్ల అటవీ జంతువులకు కూడా అనేక రోగాలు సంభవిస్తాయాని తెలిపారు. గుమ్మడిదల, మంబాపూర్ స్థానికులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ ఫ్రీ డ్రైవ్ చేపట్టిన వారిని మెదక్ చీఫ్ కన్జర్వేటర్ శరవణన్, అరణ్య భవన్ ఉన్నాధికారులు అభినందించారు. దశల వారీగా అన్ని అటవీ ప్రాం తాల్లో, అర్బన్ పార్కుల్లో స్పెషల్ డ్రైవ్ లు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెదక్ డీ ఎఫ్ ఓ జ్ఞానేశ్వర్, రేంజ్ ఆఫీసర్ నర్సాపూర్ వీరేంద్ర బాబు, సెక్షన్ అధికారి మంజీత్ సింగ్. సర్పంచ్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.