సంక్రాంతి బరిలో విజయ్ ‘మాస్టర్’..

255
Vijay
- Advertisement -

తమిళ ఇళయా దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్’. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ నెల 13న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మరో ప్రముఖ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించడం ఓ విశేషం. 200 కోట్ల వరకు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి, నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక విడుదల పరంగానూ ఈ సినిమా రికార్డు కొడుతోందని చెప్పచ్చు. తమిళనాడులో 700 థియేటర్లలో దీనిని రిలీజ్ చేస్తున్నారు. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కలిపి 400 థియేటర్లు, కేరళలో 200 థియేటర్లు, కర్ణాటకలో 100 థియేటర్లు, ఉత్తరాదిన (హిందీ వెర్షన్) 1000, విదేశాలలో 1000 థియేటర్లలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -