చెన్నపురావుపల్లిలో పల్లె నిద్ర కార్యక్రమం..

478
Palle nidra
- Advertisement -

కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. దిగ్విజయంగా సాగుతున్న కొల్లాపూర్ సేవా సమితి చైర్మన్ రంగినేని అభిలాష్ రావు కొల్లాపూర్ పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటగా రంగినేని అభిలాష్ రావు డా” బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిరంతరం పాటుపడతానని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప తట్టి వారి సమస్యలు తెలుసుకోవాలని ఒక గొప్ప ఆశయంతో ప్రారంభించిన కొల్లాపూర్ పల్లెనిద్రలో భాగంగా నిన్న రాత్రి పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావు పల్లి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వారి దృష్టికి తీసుకు వచ్చిన సమస్యల గురించి చర్చించడం జరిగింది. సమావేశం అనంతరం అందరితో సహపంక్తి భోజనం చేసి అక్కడే నిద్ర చేశాము. ఈ ఉదయం గ్రామ పెద్దల కోరిక మేరకు స్థానికులు నిరంతరం ఎదురుకుంటున్న విద్యుత్, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాలను సందర్శించడం జరిగింది. ఈ పల్లె నిద్ర కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులందరికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డ్ మెంబర్ జయరాములు, శ్రీనివాసులు, ఎల్లమ్మ, భాగ్యమ్మ, కో ఆప్షన్ సభ్యులు, లక్ష్మణ్ రావు,అజీజ్, బంగారయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దామోదరగౌడ్, హనుమంతు, వెంకటస్వామి. గ్రామనాయకులు బచ్చలవెంకటస్వామి, తంగిడిచెరువులోకేష్, గడ్స్ వెంకటస్వామి,కుమ్మరి శేఖర్, పెబ్బెటిరాజు,ఎబుజీ మరియు గ్రామ యువకులు టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -