మూడో టెస్టుకి వరణుడి అంతరాయం..

248
ind
- Advertisement -

సిడ్నీ వేదికగా భారత్ – ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు వరణుడు అంతరాయం కలిగించాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 7.1 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసింది.

ఈ క్రమంలో వరణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అద్భుత బంతితో ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ వార్నర్‌ను బోల్తా కొట్టించాడు.

మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో రోహిత్‌ శర్మ తుది జట్టులోకి రాగా గాయపడిన ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో నవదీప్‌ షైనీని జట్టులోకి తీసుకున్నారు. భారత్ తరపున షైనీ ఆరంగేట్రం చేయగా ఆసీస్‌ తరపున విల్‌ పకోవ్‌స్కీ ఆరంగ్రేటం చేశాడు.

- Advertisement -