ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ముహుర్తం ఖరారు!

40
ntr

త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాకు ముహుర్తం ఖరారైంది. మకర సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాకు కొబ్బరికాయ కొట్టనున్నారు. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ కాగా త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. హారిక హాసిని బ్యానర్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ (చినబాబు) – నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 30వ సినిమా కాగా ఈ మూవీకి ‘అయినాను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీ రోల్ పోషించనున్నారు. పవర్‌ స్టార్‌ పవన్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా 2022 సంక్రాంతిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.