వంద శాతం ఆక్యుపెన్సీతో నడవనున్న థియేటర్లు!

145
Cinema Theatres
- Advertisement -

సినీ ప్రియులకు గుడ్ న్యూస్..ఇకపై వందశాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు నడవనున్నాయి. కరోనా లాక్ డౌన్‌తో సినీ పరిశ్రమ కుదేలవడం, అక్టోబ‌ర్ 15నుంచి థియేటర్స్ ప్రారంభించుకునేందుకు కేంద్రప్రభుత్వం అనుమతిచ్చినా కరోనా కారణంగా థియేటర్లు తెరచుకోలేదు. ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ న‌డుస్తున్నాయి.

ఇక క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతుండగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంద‌శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్స్ న‌డుపుకోవ‌చ్చ‌ని జీవో జారీ చేసింది. తమిళ సర్కార్ నిర్ణయంతో థియేటర్ల యాజ‌మాన్యాలు సంతోషం వ్య‌క్తం చేశాయి.

విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ చిత్రం జన‌వ‌రి 13న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో తమిళ‌నాడు ప్ర‌భుత్వం పాస్ చేసిన ఆర్డ‌ర్స్‌తో చిత్ర నిర్మాత‌లు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -