కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళన 40వ రోజుకు చేరాయి.ఢిల్లీ సరీహాద్దులు టీక్రి, సింఘూ, ఘాజీపూర్ వద్ద రోడ్లమీద రైతులు నిరసన కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఆరు ధపాలుగా రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మరోమారు చర్చలు జరగనున్నాయి.
డిసెంబర్ 30 న జరిగిన సమావేశంలో నాలుగు షరతులకూ గాను రెండింటికి సూత్రప్రాయంగా అంగీకరాం తెలిపింది కేంద్రం. ఢిల్లీ కాలుష్య నియంత్రణ ఆర్డినెన్స్ లో రైతులకు శిక్షల నుంచి మినహాయింపు, విద్యుత్ సవరణ బిల్లుపై రైతులతో చర్చిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కీలక సమావేశం జరగనుంది.
గత రెండు రోజుల నుండి ఢిల్లీ వర్షాలు, చలిని లేక్కచేయకుండా ఆందోళన చేస్తున్నారు రైతులు ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 13న సాగు చట్టాల ప్రతులను దహనం చేస్తామని, జనవరి 23న నేతాజీ జయంతిని పురస్కరించుకుని ఆజాద్ హింద్ కిసాన్ దివస్‌ను నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. అదేవిధంగా గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ట్రాక్టర్లతో గణతంత్ర పరేడ్, రైతు కవాతు నిర్వహిస్తామని నేతలు ప్రకటించారు.