- Advertisement -
డ్రగ్స్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. తాజాగా ముంబైలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముంబైలోని ఓ హోటల్‌పై దాడులు నిర్వహించింది. అక్కడ ఓ టాలీవుడ్ హీరోయిన్ పట్టుబడినట్లు ప్రచారం జరుగుతుంది. ముంబై మీరా రోడ్డు సమీపంలో గల హోటల్ లో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేసిపెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
డ్రగ్స్ రాకెట్ లో ఓ టాలీవుడ్ నటితోపాటు చాంద్ అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశామని, సదరు నటి నుంచి 400గ్రాముల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. డ్రగ్స్ సప్లయర్ సాయిద్ పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. డ్రగ్స్ విలువ రూ.10లక్షలు ఉంటుందని తెలుస్తోంది.
- Advertisement -