- Advertisement -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మొక్కలు నాటారు. రాజ్యసభ ఎంపి సంతోష్ ఇచ్చిన పిలుపు మేరకు ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి తన జన్మ దిన సందర్భంగా ఈరోజు స్వంత గ్రామం గురుకుంటాలో మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నా ఎంపీ సంతోష్ కుమార్ తనకు ట్విట్టర్ వేదిక ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో విస్తరింప చేస్తానని ఎంపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
- Advertisement -