మొక్కలు నాటిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్..

332
Green India Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మలక్ పేట మున్సిపల్ కమిషనర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు బెలంపల్లి మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చొరవ భావితరాలకు బంగారు బాట, దూరదృష్టితో బాధ్యాయుతంగా హరిత హారం చేపట్టి మొక్కలు నాటి వాటిని కాపాడే విధంగా చట్టం తీసుకురావడం అయనకు మొక్కలపై ఉన్న బాధ్యతకు అద్దం పడుతుంది.

దీనికి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్రమంతటా అవగాహాన కల్పిస్తుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఇలాగే ముందుకు సాగాలని మరో ముగ్గురికి విద్యాధర్ నర్సంపేట, స్పందన సదాశివ పేట, రాజు మందమర్రి మున్సిపల్ కమిషనర్లకు ఛాలెంజ్ చేశారు. ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -