సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షం..

141
cm kcr
- Advertisement -

ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, పదవీ విరమణ వయస్సును పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత మంగళవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యోగులు, గౌరవవేతనాలు అందుకొంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాలను పెంచుతామని సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అన్నిరకాల ఉద్యోగులు 9,36,976 మంది ఉంటారని, వీరందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని చెప్పారు. ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

- Advertisement -