- Advertisement -
కర్ణాటకా డిప్యూటీ స్పీకర్ ఎస్ఎల్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. చిక్ మంగుళూరులో రైలు కింద పడి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మే గౌడ మృతదేహం రైలుపట్టాలపు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ధర్మే గౌడ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ నెల 15 కర్నాటక శాసనమండలిలో గొడవ జరిగింది. ఆ సమయంలో ధర్మెగౌడతో కాంగ్రెస్ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారు. కుర్చీ నుంచి ఆయన్ను లాగేసి, చొక్కా చించేశారు. మొత్తానికి ఆయన ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం కర్నాటకలో సంచలనంగా మారింది.
- Advertisement -