- Advertisement -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అన్ని వర్గాల నుండి విశేష స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తాజాగా నిజమాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం కలిగోట్ గ్రామంలో కొత్తగా పెళ్లి అయిన నూతన వధూవరులు నుతికడి శ్రీకాంత్ పటేల్, సుస్మా పటేల్ ఇద్దరు కలిసి మొక్కలు నాటారు.
ఇంత గొప్ప కార్యక్రమంలో తాము ఒక భాగమై మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని నవ వధూవరులు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు నుతికడి శ్రీకాంత్ పటేల్.
- Advertisement -