మంత్రి హరీశ్ రావుతో సంపూర్ణేశ్ బాబు

176
harishrao
- Advertisement -

సిద్ధిపేట జిల్లా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలో శుక్రవారం జరిగిన పలు వివాహా వేడుకల్లో హాజరై నూతన వధూ వరులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ఆశీర్వదించారు. ఈ మేరకు పట్టణంలోని గంగపుత్ర కమ్యూనిటీ హాల్, ముకిడి నర్సింహారెడ్డి ఫంక్షన్ హాల్స్, పద్మనాయక ఫంక్షన్ హాల్, పద్మశాలి భవన్, మిలన్ గార్డెన్స్, శివమ్స్ గార్డెన్స్, రెడ్డి ఫంక్షన్ హాల్స్ లో శుక్రవారం జరిగిన పలు వివాహా వేడుకల్లో మంత్రి శ్రీ హరీశ్ పాల్గొన్నారు.

మంత్రి హరీశ్ రావుతో ప్రముఖ సినీ నటుడు సంపూర్ణేష్ బాబు, అలియాస్ సంపూ సందడి చేశారు. సిద్ధిపేటలోని దూది మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ప్రముఖ సినీ నటుడు సంపూర్ణేష్ బాబు కుమార్తె ఇటిక్యాల భానుశ్రీ నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై భానుశ్రీని ఆశీర్వదించారు.

అంతలోనే సంపూ కోరిక మేరకు ఏర్పాటైన ఆర్కెస్ట్రా టీమ్ అన్నా నమస్తే.. హరీశన్న నమస్తే.. సిద్ధిపేట ముద్దుబిడ్డ నీకు నమస్తే.. అంటూ పాట పాడి అక్కడి వారందరినీ ఆకర్షితులైయ్యేలా చేశారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఏంసీ చైర్మన్ పాలసాయిరాం, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -