గోపీచంద్‌తో బాలయ్య నెక్ట్స్ మూవీ..?

199
Balakrishna
- Advertisement -

నటసింహా నందమూరి బాలకృష్ణ మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే బలయ్య ఈ మూవీ తర్వాత భారీ బడ్జెట్‌లో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించబోతున్నారట. అంతే కాదు బాలయ్య కోసం ఓ మాస్‌ కథను తయారుచేసినట్టు సమాచారం.

ఇప్పటికే దర్శకుడు గోపీచంద్ ఈ కథను ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారికి చెప్పినట్టు, వారికి బాగా నచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో బాలయ్యకు ఆ కథను వినిపించడానికి వీరు సిద్దమౌతున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే భారీ బడ్జెట్టుతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేసున్నారు.

- Advertisement -