మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా లాక్ డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
ఇక తాజాగా ఆచార్య సెట్‌లో సందడి చేశారు కాజల్ దంపతులు. అక్టోబర్ 30న ముంబై తాజ్ మహల్ ప్యాలెస్‌లో కాజల్ తన స్నేహితుడు గౌతమ్‌ని వివాహం చేసుకోగా తాజాగా ఆచార్య షూటింగ్‌లో జాయిన్ అయ్యారు కాజల్.
ప్రస్తుతం ఆచార్య చిత్రీకరణ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. అయితే సినిమా కోసం హైదరాబాద్ కోకాపేట లో వేసిన భారీ సెట్లో మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ పై పాట చిత్రీకరణ జరుగుతోంది. మంగళవారం ఉదయం కాజల్ భర్త గౌతమ్ కిచ్లు ఆచార్య సెట్స్‌కి వీచ్చేసి చిత్ర బృందాన్ని సర్‌ప్రైజ్ చేశారు. కాజల్ – కిచ్లు జంటకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు.కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎస్. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.