రజనీ @ మక్కల్ సేవై కర్చి

208
rajini
- Advertisement -

రానున్న తమిళనాడు ఎన్నికల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 31న రజనీ పార్టీ ప్రకటించనుండగా ఇప్పటికే అభిమాన సంఘాలతో సమావేశం నిర్వహించారు రజనీ. మార్పుకు ఇదే సరైనసమయమని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని వెల్లడించి పొలిటికల్ వర్గాల్లో హీట్ పెంచారు.

రజనీ పార్టీ పెడతారని ప్రకటించిన దగ్గరి నుండి సోషల్ మీడియాలో రోజుకో వార్త షికార్ చేస్తోంది. రజినీకాంత్ పార్టీ పేరు మక్కల్ సేవై కర్చి అని … పార్టీకి ఆటో గుర్తు కేటాయించారని ప్రచారం జరుగుతోంది.

మక్కల్ సేవై కర్చి అంటే ప్రజాసేవ పార్టీ అని అర్ధం. రజినీకాంత్ పార్టీ గుర్తు ఆటో అని సోషల్ మీడియాలో లీక్ కావడంతో తమ అభిమాన హీరో ఆటో ఫోటోలను పోస్టు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

- Advertisement -